10-05-2025 11:37:34 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): ఎదురుగా వస్తున్న రెండు వాహనాలైనా అందులో ఒకటి లారీ, వేరొకటి బైక్ ను వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టిన సంఘటనలో ఒక వ్యక్తి మృతి. వివరాల్లోకి వెళితే స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోడీగాం శివార్లో శనివారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన గంగుల నర్సాగౌడ్ (55) మొండి సడక్ నుంచి చిన్న మల్లారెడ్డి గ్రామానికి బైక్ పై వెళ్తున్నాడు. మోడేగాం శివారులోని రైస్ మిల్ వద్దకు రాగానే బాన్సువాడ వైపు వెళ్తున్న లారీ బాన్సువాడ ఎక్స్ రోడ్డు వైపు వస్తున్న బైకర్ నీ వేగంగా వస్తున్న లారీ, బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సాగౌడ్ తలకు తీవ్ర గాయామై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.