10-05-2025 11:48:21 PM
చేగుంట/నార్సింగి,(విజయక్రాంతి): చేపల వేటకు వెళ్ళి చెరువులో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ అహ్మద్ మోహిఉద్దీన్,తెలిపిన వివరాల ప్రకారం పట్టణ కేంద్రానికి చెందిన చందంపేట నరేష్ (30), అవివాహితుడు, రోజు వారీ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం చేపల వేటకని మండల కేంద్రంలోని ఖాన్ తలాబ్ ( కాముని చెరువు) కు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయాడు. నరేష్ కుటుంబ సభ్యులు అతను బంధువుల వద్దకు వెళ్ళాడని భావించారు. శుక్రవారం మధ్యాహ్నం చెరువులో మృతదేహం తెలిగా నరేష్, నీట మునిగాడన్న విషయం తెలిసింది. విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ అహ్మద్ మోహిఉద్దీన్ సిబ్బంది తో సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పంచనామా నిర్వహించి, పోస్ట్ మార్టం నిమిత్తం రామాయంపేట కమ్యూనిటీ ఆసుపత్రి కి తరలించారు. నరేష్ బంధువుల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అహ్మద్ మోహిఉద్దీన్ తెలిపారు.