17 April, 2026 | 3:23 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

29-05-2025 12:38 AM

- పిల్లల అభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి పాటుపడాలి 

- అంగన్వాడి అధికారులు చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదు 

- దేశభవిష్యత్ పిల్లల చేతిలో పిల్లల భవిష్యత్తు 

- ఉపాధ్యాయుల చేతుల్లో రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క 

భద్రాద్రి కొత్తగూడెం, మే 28 (విజయక్రాంతి) : అధికారులంతా సమన్వయంతో పనిచేసి పిల్లల అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధికి తోడ్పడాలని, అంగన్వాడి అధికారు లు చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదని, దేశ భవిష్యత్ వెలల చేతుల్లో.. పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయ చేతుల్లో ఉందని రాష్ర్ట పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నేటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తన సరి అనసూర్య, సీతక్క ఘాటు గా వ్యాఖ్యానించారు.

బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పనితనాన్ని మెరుగుపరచుకొనేందుకే ఈ సమీక్ష సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో చేపట్టిన అంగన్వాడి భవన నిర్మాణాలను యుద్ధ ప్రాతిప దికపై పూర్తి చేయాలన్నారు.

ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు, పాఠశాలలను గుర్తించి అంగన్వాడీ కేంద్రాలను వాటిలోకి తరలించాలని ఆదేశించారు. రాష్ర్టవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు కార్యాలయాల్లో కూర్చొ ని కాలక్షేపం చేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటించా లన్నారు.

తద్వారా అంగన్వాడి అధికారులు జిల్లా ఔన్నత్యాన్ని కాపాడాలని కోరారు. అంగన్వాడి కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని  ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాల్లో కాంట్రాక్టర్లు నాణ్యతలేని ఆహారాన్ని సరఫరా చేస్తే వెంటనే తిరస్కరిం చాలన్నారు.

పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల ఆలనా పాలన చూసుకోవడం కోసం క్రష్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వయావృద్ధుల సంక్షేమానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఆస్తులు తీసుకొని తల్లిదండ్రులను చూడని పిల్లలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

త్వరలో అంగన్వాడీ కేంద్రాల్లో ఫిజియోథెరపీ సేవలను ప్రారంభిస్తామన్నారు. వేసవి సెలవుల అనంతరం అంగన్వాడీ కేంద్రాల ప్రారంభం సెల్ఫీ విత్ అంగన్వాడీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వికలాంగులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నారు.

మారుమూల ప్రాంతాలకు సైతం సురక్షిత నీరు అందించాలి..

గాలి తర్వాత ప్రజలకు అత్యంత ముఖ్యమైనది నీరని, దాన్ని ప్రజలందరికీ అందించడమే మన అంతమ లక్ష్యం గా ఉందని మంత్రి అన్నారు. మిషన్ భగీరథ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ప్రతి మారుమూల ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలని ఆదేశించారు. వారం రోజులపాటు మిషన్ భగీరథ సమస్యలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు.

తాగునీటి సరఫరా లో ఎలాంటి అంతరాయం లేకుండా సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా మిషన్ భగీరథ ద్వారా చేపట్టిన పనుల నివేదికను అందించాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా మంజూరైన, చేస్తున్న పనుల వివరాలను స్థానిక శాసనసభ్యులకు అందజేయాలన్నారు.

ప్రతి 15 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా చేపట్టుతున్న పనులు సమన్వయ పరుచుటకు ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు. తాగునీటి సరఫరా లో సమస్యలు తలెత్తితే ప్రజలకు తెలియజేయాలని, వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు.

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకున్న అధికారులను అభినందించారు.ఈ సమావేశంలో భద్రాచలం పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్, రాందాస్ నాయక్ కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు.