calender_icon.png 12 November, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అచ్చంపేట గురుకుల పాఠశాలను సందర్శించిన అధికారులు

12-11-2025 12:14:05 AM

నిజాంసాగర్, నవంబర్ 11( విజయ క్రాంతి): పిల్లల కడుపు కొడుతున్నారు అనే శీర్షిక నా విజయ క్రాంతి దినపత్రికలో  మంగళవారం ప్రచురించిన కథనానికి స్పందించిన జిల్లా అధికారులు అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా శిశు సంక్షేమ శాఖ పిడి ప్రమీల సందర్శించారు. పాఠశాలలో పారిశుధ్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని అధికారులు పరిశీలించగా వారికి అన్నంలో పురుగులు కనిపించడం విశేషం. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని మరుగుదొడ్లు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆమె ఆదేశించారు. ఆమె వెంట గురుకుల పాఠశాల జోనల్ ఆఫీసర్ పూర్ణచందర్, బాన్సువాడ సిడిపిఓ సౌభాగ్య, ఎంపీడీవో శివకృష్ణ, ఎంఈఓ తిరుపతిరెడ్డి,సూపర్వైజర్లు భాగ్యలక్ష్మి, తదితరులున్నారు.