calender_icon.png 12 November, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జుక్కల్ హైస్కూల్‌కు కుస్తీ పోటీల్లో పతకాల పంట

12-11-2025 12:12:24 AM

జుక్కల్, నవంబర్ 11 (విజయక్రాంతి) : ఎస్ జి ఎఫ్ అండర్ 14 అండ్ అండర్ 17 బాయ్స్ అండ్ గరల్స్ జిల్లా స్థాయి రెజ్లింగ్ టోర్నమెంట్ జడ్పిహెచ్‌ఎస్ మాచాపూర్ లో జరిగిన కుస్తీ పోటీల్లో జెడ్పిహెచ్‌ఎస్ జుక్కల్ విద్యార్థులు పతకాలతో తమ సత్తా చాటారు. మొత్తం 12 పతకాలు సాధించగా అందులో నాలుగు గోల్ మెడల్, ఆరు సిల్వర్ మెడల్ ఒక బ్రొంజ్ మెడల్ లను సాధించినట్లు శిక్షకుడు పిడి ఎస్. దానయ్య తెలిపారు. 

జడ్పీహెచ్‌ఎస్ జుక్కల్ ప్రధానోపాధ్యాయులు హనుమంత రెడ్డి, జుక్కల్ ఉపాధ్యాయ బృందం పాఠశాల పిడి కి శుభాకాంక్షలు తెలిపారు. గోల్ మెడల్ సాధించిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. గోల్ మెడల్ సాధించిన విద్యార్థులు జే. శుభం 71 కేజీ విభాగంలో గోల్ మెడల్, జి. గోవర్ధన్ 65 కేజీల విభాగంలో గోల్ మెడల్, జె. త్రిష 49 కేజీల విభాగంలో గోల్ మెడల్, పి. ఉమేష్ 41 కేజీల విభాగంలో గోల్ మెడల్ సాధించడం జరిగిందన్నారు. ఈ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరుగుతున్న  కుస్తీ పోటీల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా కే. రామ్ చరణ్ 55 కేజీల విభాగంలో, పి. ప్రదీప్ 45 కేజీల విభాగంలో, ముజాహిద్ 71 కేజీల విభాగంలో రాష్ట్ర స్థాయి గ్రీకో రోమన్ రెస్లింగ్ పోటీల్లో తెలపడనున్నట్లు తెలిపారు.