7 May, 2026 | 10:46 PM

మండల స్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభం

10-12-2024 08:00 PM

పటాన్ చెరు: మండల కేంద్రం జిన్నారంలోని గిరిజన గురుకుల విద్యాలయం ఆవరణలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఎంపీడీవో అరుణ రెడ్డి, ఎంఈఓ కుమారస్వామి మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను నిర్వహిస్తోందన్నారు. మొదటి రోజు కోకో, వాలీబాల్ పోటీలు జరిగాయి. ప్రథమ స్థానంలో జిన్నారం గ్రామపంచాయతీ క్రీడాకారులు, ద్వితీయ స్థానంలో మాదారం క్రీడాకారులు నిలిచారు. కోకో పోటీలలో ప్రథమ స్థానంలో జిన్నారం, ద్వితీయ స్థానంలో గడ్డ పోతారం పంచాయతీ క్రీడాకారులు నిలిచారు. బాలికల వాలీబాల్, కోకో పోటీలలో గడ్డపోతారం విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీడీలు, తదితరులు పాల్గొన్నారు.