calender_icon.png 10 June, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనందో బ్రహ్మ!

02-03-2025 12:00:00 AM

మంచి కబురు విన్నప్పుడో.. కలలుగంటున్నప్పుడు.. ఉద్యోగం లభించినప్పుడో.. విజయం సాధించినప్పుడో.. ఇలాంటి సందర్భాల్లో ఎవరికైనా ఆనందం, సంతోషం కలుగుతాయి. ఇంతకీ ఆనందమంటే ఏంటి? దానికి ప్రత్యేక నిర్వచనమంటూ ఏదైనా ఉందా? అంటే లేదని చెప్పవచ్చు. శరీరపరంగా చూస్తే.. ఆనందమనేది ఓ భావోద్వేగ స్థితి.

ఒంట్లో డోపమిన్, సెరటోనిన్ వంటి ఎంజైమ్‌లు శరీరంలో విడుదలైనప్పుడు ఇలాంటి స్థితి కలుగుతుంది. అయితే ఇది మనసుకే పరిమితం కాదు. ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. హాయిగా, ఆరోగ్యంగా జీవించి ఉండటానికి ఆనందం సానుకూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు నొక్కి చెబుతున్నాయి.

ఆనందంగా ఉన్న రోజుల్లో గుండె కొట్టుకునే తీరు సాఫీగా సాగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఆనందంగా ఉండే వారిలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటున్నట్టు, ఫలితంగా జబ్బులను మరింత సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు చాలా అధ్యయనాల్లో వెల్లడైంది.