ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్ లో అగ్ని ప్రమాదం
21-06-2026 12:16 PM
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్, సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కరీంనగర్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే రాజీవ్ రహదారి పై తిమ్మాపూర్ వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించి, దట్టమైన పొగ కమ్ముకుంది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.






