ఆయిల్ ఇండియా బోనస్ ఇష్యూ
నికరలాభం రూ.2,332 కోట్లు
న్యూఢిల్లీ, మే 21: దేశంలో రెండో పెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ్థ ఆయిల్ ఇండియా డైరెక్టర్ల బోర్డు 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి (ప్రతీ రెండు షేర్లకూ ఒక షేరు బోనస్) ఆమోదం తెలిపింది. దీనితో పాటు రూ.3.75 తుది డివిడెండును సిఫార్సుచేసింది. బోనస్ షేర్ల జారీకారణంగా ఒక్కో షేరుకు రూ.2.50 డివిడెండు వస్తుంది. కంపెనీ 2024 జనవరిెేమార్చి త్రైమాసికంలో రూ.2,332 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ఆర్జించింది. నిరుడు ఇదేకాలంతో పోలిస్తే ఈ మార్చి క్వార్టర్లో నికరలాభం 18 శాతం వృద్ధిచెందింది. ముగిసిన క్వార్టర్లో క్రూడ్ ధరలు అధికంగా ఉన్నందున కంపెనీ టర్నోవర్ 16 శాతం పెరిగి రూ.10,375 కోట్లకు చేరింది. క్రూడాయిల్ ధరలు పెరిగిందున, దీని అమ్మకాలతో రాబడి 18 శాతం ఎగిసిందని, గ్యాస్ ధరలు కనిష్ఠంగా ఉన్నందున, దీనిద్వారా రాబడులు 16.5 శాతం తగ్గినట్టు కంపెనీ వివరించింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికరలాభం 29 శాతం క్షీణించి రూ.6,980 కోట్ల వద్ద నిలిచింది.






