31 August, 2026 | 9:30 AM

Breaking News

భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. బోనం ఎత్తిన ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి   •   క్రీడా స్ఫూర్తితో గెలపోటములను స్వీకరించాలి: ప్రాజెక్టు అధికారి రాహుల్   •   చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పొడిగించాలి   •   ఆదివాసి యువతి శిరీష కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలి   •   యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ గొప్ప అవకాశం   •   యావాపూర్ లో ఘనంగా బోనాలు   •   అత్యంత వైభవంగా బోనాల పండుగ   •   సాంబ శర్వాణి రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి   •   ఉమ్మడి మానాలలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి   •   కౌకూర్ మోడల్ మార్కెట్ భవనం కోసం నాలుగో రోజు ధర్నా   •  

ఓఎన్‌జీసీ నికరలాభం 78 శాతం వృద్ధి

22-05-2024 01:25 AM

ఆదాయం రూ.1.66 లక్షల కోట్లు

షేరుకు రూ.5 చొప్పున డివిడెండు

న్యూఢిల్లీ, మే 21: ప్రభుత్వ రంగ చమురు ఉత్పాదక కంపెనీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) నికరలాభం 2024 మార్చితో ముగిసిన క్యూ4లో భారీగా 78 శాతం వృద్ధిచెంది రూ. 11,526 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 6,478 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయం రూ.1.64 లక్షల కోట్ల నుంచి రూ.1.66 లక్షల కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఓఎన్‌జీసీ రూ.57,101 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభా న్ని ఆర్జించింది. ముగిసిన ఏడాది క్రూడాయి ల్ ఉత్పత్తి 2.4 శాతం పెరిగిందని, సహజవా యువు ఉత్పత్తి 3 శాతం తగ్గిందని కంపెనీ వెల్లడించింది. ఓఎన్‌జీసీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 5 చొప్పున డివిడెండును సిఫార్సుచేసిం ది. కంపెనీ ఏజీఎంలో షేర్‌హోల్డర్ల అనుమ తికి లోబడి డివిడెండును చెల్లిస్తుంది.