14 July, 2026 | 10:51 AM

4 నెలలకే వైదొలిగిన ఓలా సీఈవో

30-04-2024 12:05 AM

 20% ఉద్యోగాలకు కోత

ముంబై, ఏప్రిల్ 29: ఓలా క్యాబ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హేమంత్ భక్షి తాను చేరిన నాలుగు నెలలకే కంపెనీని వీడారు. ఓలా క్యాబ్స్ భారీ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) పత్రాల ను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి దాఖ లు చేస్తున్న సమయంలోనే సీఈవో రాజీనామా చేయడం గమనార్హం. ‘హేమంత్ కంపెనీ వెలుపల అవకాశాలను అన్వేషించడానికి సీఈవోగా తప్పుకుంటున్నారు. హేమంత్ అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అంటూ కంపెనీ సోమ వారం ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఓలా క్యాబ్స్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 20 శాతం మంది ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తున్నది. దీంతో దాదాపు 250 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది.

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), టెక్నాలజీల్లో తాము గణనీయమైన పెట్టుబడులు చేశామని, దీంతో భారీగా వ్యయాలు తగ్గుతాయని కంపెనీ ప్రకటన తెలిపింది. ఈ మా ర్పులతో కంపెనీలో కొన్ని రోల్స్‌కు ప్రాధాన్యత ఉండదని, ఈ మార్పిడి సమయంలో ప్రభావితమై నవారికి మద్దతు ఇచ్చేందుకు కట్టుబడి ఉంటాయని ఓలా క్యాబ్స్ ప్రకటన వివరిం చింది. ఓలా క్యాబ్స్ మాతృసంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా భవిశ్ అగర్వాల్ కొనసాగుతారు. కంపెనీ సబ్సిడరీ ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో పత్రాల్ని గత డిసెంబర్‌లో సెబీకి సమర్పించింది.