1 September, 2026 | 10:42 PM

ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి

01-09-2026 | 09:47pm

చందుర్తి,(విజయక్రాంతి): మండలంలోని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆద్వర్యంలో కొత్త పెన్షన్ విదానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలని నల్ల బ్యాడ్జీలు దరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కటుకూరి ముఖేష్ మాట్లాడుతూ... సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగులకు పెన్షన్ బిక్ష కాదని అది ప్రతి ఉద్యోగి హక్కు  అని తీర్పు ఇవ్వడం జరిగింది. సిపిఎస్ ను రద్దు చేస్తామని ప్రభుత్వాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోవడం బాదాకరమని అన్నారు.

కొత్త పెన్షన్ విదానాన్ని రద్దు చేయకపోతే భవిష్యత్తులో మరింతగా ఉద్యమాలు చేస్తామని,అదే విదంగా జీవో నెంబర్ 25ని సవరించాలని, ఇటీవల విద్యాశాఖ ఇచ్చిన బాహ్య మూల్యాంకన విదానపు ఉత్తర్వులను తిరిగి వెనక్కి తీసుకోవాలని  పిఆర్సి ప్రకటించాలని పెండింగ్లో ఉన్న  6 డిఏలను తక్షణమే విడుదల చేయాలని హెల్త్ కార్డులను అన్ని కార్పోరేట్ హాస్పిటల్లో ఓపి సౌకర్యం, మూడు లక్షల పరిమితిని కాకుండా పది లక్షల వరకు పెంచాలని కాంపిటెంట్ పాఠశాలలో తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వాలని ఎఫ్ఎల్ఎన్ విజయవంతం చేయడానికి ప్రభుత్వం తగినంత ఉపాధ్యాయులు లేకపోతే విద్యా వాలంటీర్లను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.