calender_icon.png 19 February, 2026 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూలో పోస్టర్ ఆవిష్కరణ

19-02-2026 02:23:49 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి18  (విజయక్రాంతి): ఓయూలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్ (ఏఐయూ) సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల ప్రతిష్టాత్మక సదస్సు గురువారంప్రారంభం కానుంది.ఈ మేరకు ఓయూలో బుధవారం ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్, ఏఐయూ అధ్యక్షులు ప్రొఫెసర్ వినయ్ కుమార్ పాఠ క్,జనరల్ సెక్రటరీ డాక్టర్ పంకజ్ మిట్టల్, నోడల్ అధికారులు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.చంద్ర శేఖర్, సిఎఫ్‌ఆర్డి డైరెక్టర్ ప్రొఫెసర్ ఇ.సుజాత లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వీసీ ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ ఈ సదస్సు కు ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై ప్రారంభిస్తా రన్నారని తెలిపారు. భారతదేశంలో ఉన్నత విద్యను భవిష్యత్ సవాళ్ల కు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఈ సదస్సు ఒక కీలక వేదికగా నిలుస్తుందన్నారు.

ఏఐ బాధ్యతా యుత వినియోగం, విద్య విధాన సంస్కరణలు, విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారం పై అర్థవంతమైన చర్చ జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులో సెంట్రలో జోన్ పరిధిలోని తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిస్సా రాష్ట్రాలకు చెందిన సుమారు 120 మంది ప్రతినిధులు, వైస్ ఛాన్స్ లర్లు, సీనియార్ విద్యా నిర్వాహకులు పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నా రని ప్రొఫెసర్ కుమార్ తెలిపారు.