13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఒమేగాలో క్యాన్సర్ ఫౌండేషన్

09-03-2026 12:12 AM
  1. ప్రారంభించిన మంత్రి సీతక్క 
  2. మహిళల ఆరోగ్యంపై అవగాహన 

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒమేగా హాస్పిటల్స్ ‘ఒమేగా క్యాన్సర్ ఫౌండేషన్’ను మంత్రి సీతక్క ప్రా రంభించారు. ఒమేగా ఉమెన్స్ వెల్నెస్ సమ్మిట్2026లో ప్రజాప్రతినిధులు, వైద్య నిపు ణులు, సామాజిక నేతలు పాల్గొని మహిళల ఆరోగ్యం, క్యాన్సర్‌పై అవగాహన, ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతపై చర్చించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కొవాలంటే ముందస్తు జాగ్రత్తలు, త్వరిత నిర్ధారణ, నాణ్యమైన వైద్య సేవలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

మహిళల ఆరోగ్యం, సం క్షేమం ప్రాధాన్యతగా ఉండాలని చెప్పారు. స్టాండ్ విత్ హర్ అనే సందేశాన్ని ప్రస్తావి స్తూ మహిళలు తమ ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకునేలా కుటుంబాలు, సమాజం సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఫౌండేషన్ కార్యకలాపాలకు మద్దతుగా ఒమేగా హాస్పిటల్స్ ప్రత్యేక మౌలిక సదుపాయాలను ప్రకటించింది. బంజారాహిల్స్‌లో ఉన్న 230 పడకల సమగ్ర క్యాన్సర్ ఆస్పత్రిలో మొత్తం సామర్థ్యంలో 25 శాతానికి పైగా అయిన 60 పడకలను ఒమేగా క్యాన్స ర్ ఫౌండేషన్కు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.

ఒమేగా హాస్పిటల్స్ చీఫ్ సర్జికల్ ఆం కాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మొహన వంశీ మాట్లాడుతూ చికిత్సతో పాటు క్యాన్సర్‌పై అవగాహన పెంపు, ముందస్తు నిర్ధార ణ, నివారణ వైద్యంపై సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. సమాజానికి విశేష సేవలు అందించిన మహిళలను ‘ఆస్థ శక్తి అ వార్డులు డాటర్స్ ఆఫ్ ది సాయిల్’ పేరుతో సత్కరించారు.

అవార్డు గ్రహీతల్లో కల్పన రమేష్ జల శక్తి (పట్టణ జల సంరక్షణలో నా యకత్వం), డా. శివరంజని సంతోష్  ఆరోగ్య శక్తి (ప్రజారోగ్య అవగాహన), ఎన్‌ఎస్కే కుమారి  కరుణ శక్తి (జంతు సంరక్షణలో సేవలు), శైలజ కిరణ్  ధన శక్తి (పరిశ్రమల్లో నాయకత్వం, వ్యాపారోత్సాహం), రూపా మాగంటి  ఉద్యమ శక్తి (గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు), లక్ష్మీ మంచు  కళా శక్తి (కళ, సినిమా ద్వారా సామాజిక సేవ), లలితా రా ఘురాం  జీవన శక్తి (అవయవ దానం అవగాహన), సునీత కృష్ణన్  న్యాయ శక్తి (మాన వ అక్రమ రవాణా నిరోధం) తదితరులు ఉన్నారు.