4 July, 2026 | 8:54 PM

Breaking News

సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •  

తిరువీర్ పుట్టినరోజు సందర్భంగా..

24-07-2024 12:00 AM

తిరువీర్ నటిస్తున్న నూతన చిత్రం “భగవంతుడు”. గోపి.జి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ నటుడు రిషి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మంగళవారం (జూలై 23) హీరో తిరువీర్ పుట్టినరోజు సందర్భంగా ఈ పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా నుంచి ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్ విడుదల చేశారు ‘భగవంతుడు’ రూపకర్తలు. ఏషియన్ ఫిల్మ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: - రాజ్ తోట, మ్యూజిక్ :- కె.పి, ప్రొడక్షన్ డిజైనర్ :- గాంధీ, ఎడిటర్ - ప్రవీణ్ పూడి.