మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవానికి కోటీ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వేడుకల వారీగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలను అందజేస్తామన్నారు. డ్వాక్రా మహిళల ద్వారా ఇంటింటికి బొట్టు పెడుతూ చీరలను అందిస్తామన్నారు. దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఇంద్ర గాంధీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారన్నారు.
బిఆర్‌ఎస్ హాయంలో పంపిణీ చేసిన చీరలు లబ్ధిదారులు పంటలకు రక్షణగా కట్టేవారని కట్టే వారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు పండుగలకు, శుభకార్యాలకు వేసుకునే చీరలను అందిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి మహిళ ఇందిరమ్మ చీరలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి సురేందర్, డి ఆర్ డి ఏ అధికారులు, మహిళ సమాఖ్య ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ
సదాశివ నగర్, నవంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో మహిళ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ చీరలు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం కోటి మహిళా శక్తి చీరలను పంపిణీ చేసినట్టు తెలిపారు సమాజంలో మహిళల గౌరవం ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల పథకం అని వెల్లడించారు మొదటి విడత నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతంలో పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు .
ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండల కేంద్రంలో ఈరోజు ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ.. మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విడతల వారీగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తామని తెలిపారు. కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు అందజేస్తామని వ్యాఖ్యానించారు.
డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
పెద్ద కొడప్గల్, నవంబర్ 23 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వ ర్యంలో డ్వాక్రా మహిళలకు ఆదివారం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం కల్పించిందని తెలిపారు.
డ్వాక్రా మహిళలకు 10లక్షల ప్రమాద బీమా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరి, డ్వాక్రా గ్రూప్ లబ్ధి దారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడితే రెండు లక్షల వరకు రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఐకేపీ ఏపిఓ, విఓఏ సంతోష్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు మహేం దర్ రెడ్డి, కాటేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహిద్దిన్ పటేల్, నాయకులు మల్లప్ప పటేల్,శ్యామప్ప,గంగా గౌడ్, ఆకుల పర్వయ్య, మొగలా గౌడ్, ఇస్మాయిల్ పటేల్, అశోక్, రవీందర్, సాయిలు, శంకర్, చాంద్ పాషా పాల్గొన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట
కామారెడ్డి,నవంబర్23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో ఆదివారం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా డ్వాక్రా మహిళా సంఘ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంతన్న కానుకగా గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, ఐకేపీ సిబ్బంది పేద మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.
ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యకమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో కోటి మంది మహిళలకు చీరలు అందించడం మహిళల సాధికారతే లక్ష్యంగా, వారిని కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశయమని అదే దిశగా ప్రజాపాలన కోనసాగుతుందని ఆయన అన్నారు. కోటి మహిళలకు చేనేత చీరలు అందించే ఉద్దేశంతో పథకాన్ని ప్రవేశపెట్టి చేనేత కార్మికులకు అండగా ప్రజా ప్రభుత్వం ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,మంత్రివర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మాజీ సర్పంచ్ రేవతి, అధ్యక్షుడు రాకేష్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, రోడ్డ రాజు, కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డి, శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, నర్సింలు, ఐకేపీ ప్రతినిధులు లత, సుజాత, మౌనిక, వెంకట్ రాజ్ గౌడ్, స్వామి, విజయ పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో..
బిచ్కుంద, నవంబర్ 23,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామం లో కాంగ్రెస్ నాయకులు ఆదివారం మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ...మహిళల సంక్షే మం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను కొనియాడారు.
ఇందిరమ్మ మహి ళా శక్తి పథకం ద్వారా పేద, మధ్యతరగతి మహిళలకు అండగా నిలవడమే తమ లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమం లో సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ముగ్డే వార్ బస్వంత్ రావ్ సోమావార్ మహేష్ కాంగ్రెస్ నాయకులు పాలుగోన్నారు.




