15 April, 2026 | 8:05 AM

ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సాయం

24-11-2025 12:00 AM

రాజాపూర్ నవంబర్ 23: మండలంలోని కల్లేపల్లి గ్రామనికి చెందిన దొంతం శెట్టి శ్రీనివాస్ కూతురు నిహారిక, సింగమా గూడ తాండాకు చెందిన సూర్య నాయక్ కూతురు బిందు వివాహానికి బిఆర్‌ఎస్ పార్టీ యువనాయకుడు చించోడ్ అభిమన్యు రెడ్డి రూ. 10వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఆదివారం అభిమన్యు యువసేన సభ్యులు వివాహా వేడుకలకు హాజరై నూతన వధువులకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాకలి శ్రీను, ప్రతాప్, బండ శ్రీను, బుచ్చయ్య, శ్రీకాంత్, అశోక్, శేఖర్  బీఆర్‌ఎస్ నాయకులు, యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.