calender_icon.png 25 May, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ

24-05-2025 11:12:56 PM

జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్..

మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలో నూతన ఆహార భద్రత కార్డు, కార్డులలో సభ్యులను చేర్చడం కొరకు అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి ఆహర భద్రత కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్(District Additional Collector Sabavat Motilal) తెలిపారు. జిల్లాలో అందిన దరఖాస్తులపై విచారణ జరిపి అర్హులైన వారిని ఎంపిక చేసి గత రెండు నెలలకు సంబంధించి (మే, జూన్-2025) 4 వేల 797 నూతన రేషన్కార్డులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

అదే విధంగా రేషన్కార్డులలో పిల్లలను చేర్పించడం వంటి తదితర ముటేషన్ల కొరకు 35 వేల 178 దరఖాస్తులు విచారణ జరిపి ఆమోదించడం జరిగిందని తెలిపారు. రేషన్కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ప్రజలు మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయి విచారణ జరిపి అర్హులకు కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు.