10 May, 2026 | 5:13 AM

రేపటి నుంచి ఒంటిపూట బడులు

14-03-2025 01:27 AM

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు అమలు కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 23 వరకు  రాష్ర్టవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఒంటి పూట బడుల నేపథ్యంలో పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మధ్యాహ్న భోజనం అందించి పిల్లలను ఇంటికి పంపాల్సిందిగా అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. 10వ తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని వెల్లడించింది.

పదో తరగతి పరీక్ష సెం టర్లు పడే పాఠశాలల్లో మాత్రం మధ్యా హ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు ఉంటాయని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు జరగనున్నట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.