21 June, 2026 | 9:16 AM

కేంద్ర ప్రభుత్వ పథకాలపై యువతకు ఒకరోజు వర్క్ షాప్

05-08-2025 07:25 PM

హనుమకొండ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బి నవీన్ కుమార్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): మేరా యువభారత్ (నెహ్రూ యువ కేంద్ర) వరంగల్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై యువతకు ఒకరోజు వర్క్ షాప్ ను హనుమకొండ లక్ష్మీపురంలో మేరా యువ భారత్ సమావేశపు హాలులో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హనుమకొండ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ మొదట వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.

అనంతరం మాట్లాడుతూ స్వయం ఉపాధితో ఎదగలనుకునేవారు, భవిష్యత్తులో వ్యాపారం చేయదలచుకున్నవారు ఆరంగానికి సంబంధించిన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని జిల్లా పరిశ్రమల శాఖ అందిస్తున్న పీఎం సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, స్టార్టప్ ఇండియా, పద్దెనిమిది రకాల వృత్తులగల వారికి పీఎం విశ్వకర్మ పథకాల ద్వారా ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు.