calender_icon.png 6 August, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ బస్టాండ్ లో రాఖీ కౌంటర్

05-08-2025 07:29:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): దూర ప్రాంతాలకు సోదరులకు రాఖీ కట్టడానికి వెళ్లలేని సోదరీమణుల కొరకు నిర్మల్ బస్టాండ్ లో ఆర్టీసీ ప్రత్యేక రాఖీ కౌంటర్ ను ఏర్పాటు  చేసినట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. సోమవారం స్థానిక బస్టాండ్ లో  రాఖీలు పంపే కౌంటర్లు ప్రారంభించారు. కార్గో ద్వారా రాఖీ లు పంపడానికి ఈ సౌకర్యం కలిపిస్తున్నట్లు డిపోమేనేజర్ తెలిపారు. ఈ కౌంటర్ దగ్గరకు వచ్చి బుక్ చేసినచో మీ రాఖీలు వేగంగా భద్రంగా చెర వేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కిషోర్, స్టేషన్ మేనేజర్ ఏ.ఆర్.రెడ్డి, కంట్రోలర్లు పి.ఆర్.గోపాల్, గజపతి ఉన్నారు.