05-08-2025 09:30:47 AM
హైదరాబాద్: మేడ్చల్ మార్కెట్ వద్ద సిలిండర్ పేలుడు(Gas Cylinder Explosion ) సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పూల దుకాణం, మొబైల్ షాపు నిర్వమిస్తున్న ఇంట్లో సోమవారం రాత్రి పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఎగిరిపడిన శకలాలు తగిలి రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. పేలుడు ధాటికి మరో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా వారిని కొంపల్లి ఆస్పత్రికి తరలించారు. సిలిండర్ పేలుడు ధాటికి దుకాణం పైకప్పు కూలింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.