05-08-2025 11:36:55 AM
మంథని, (విజయక్రాంతి): మంథని ఎంపీవోగా(Manthani MPO) వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జూలపల్లి మండలం నుంచి అనిల్ రెడ్డి మంథనికి బదిలీ అయి మంథని మండలం మండల పంచాయతీ అధికారి గా విధులలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథని మండలి అభివృద్ధికి మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు సహకరించాలని కోరారు.