calender_icon.png 5 August, 2025 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమయపాలన పాటించని వైద్యులపై చర్యలు

05-08-2025 10:40:19 AM

జిల్లా కలెక్టర్ హైమావతి 

సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న వైద్యులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హైమావతి(District Collector Hymavathi) హెచ్చరించారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం కేసీఆర్ నగర్ లోని బస్తి దావఖానను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. అటెండెన్స్, ఓ పి రిజిస్టర్, లీవ్ లెటర్ లు వెరిఫై చేశారు.

రోజుకీ 60 నుండి 80 మధ్యలో పేషంట్ లు వస్తారని స్టాఫ్ నర్సు బాలమణి తెలిపారు. మెడిసిన్ అందుబాటులో ఉందా, సీజనల్ వ్యాధులకు సంబంధించి అన్ని పరికరాలు ఉన్నాయని ఆరా తీశారు.  రిజిస్టర్ లో కంప్లైంట్ రాసి సమయం ఉదయం 9.45 అయిన కూడా డ్యూటీ డాక్టర్  గైర్హాజరుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిఎం అండ్ ఎచ్ ఓ కీ తెలిపారు. కాలు గాయంతో దవాఖానాకి వచ్చిన రోగితో మాట్లాడుతూ.. వైద్యం ఎలా చేస్తున్నారు, డాక్టర్ అందుబాటులో ఉంటారా ప్రశ్నించగా  వైద్యం బాగానే చేస్తున్నారని అందుబాటులో ఉంటారని రోగి కలెక్టర్ కి తెలిపారు. ఎలాంటి వ్యాధికైనా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేసుకోవాలని ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని తప్పనిసరిగా వాడుకోవాలని సూచించారు.