23 June, 2026 | 11:59 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

నకిరేకల్‌లో కాటన్ సర్చ్

05-08-2025 11:22 AM

నేర నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్

 సరియైన పత్రాలు లేని 120 మోటర్ సైకిల్స్,పది ఆటోలు, 15 ఆవు దూడలు సీజ్ ..

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..

నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ పట్టణ పరిధిలో మంగళవారం  తెల్లవారు జామున నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి(Nalgonda DSP Sivaram Reddy) ఆధ్వర్యంలో 5 మంది సీఐలు 20 యస్.ఐలు టీజీఎస్పి సిబ్బంది 50 మందితో మొత్తం కలిపి 300 మంది పోలీస్ సిబ్బందితో   దాదాపు 350 ఇళ్లల్లో కాటన్ సర్చ్ సోదాలు నిర్వహించారు . జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపిన వివరాల ప్రకారం సరియైన పత్రాలు లేని మొత్తం 130 వాహనాలు పట్టుబడగా, వీటిలో 120 ద్వి చక్ర వాహనాలు,10 త్రీ చక్ర వాహనాలు,08 మంది అనుమానితులను గుర్తించడం జరిగిందని ఇందులో ఒక ఆస్తి సంబంధిత నేరస్తున్నీ అదుపులో తీసుకోవడం జరిగిందనీ ఆయన తెలిపారు.

 ఇతర దేశాలు నేపాల్ నుంచి వచ్చిన ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరిని ఆధారాలను చెక్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఒక షెడ్ లో అక్రమంగా ఉంచిన 15 ఆవు దూడలు పట్టుబడి చేయడం జరిగిందనీ వీటిని చట్టప్రకారం గోశాల కు తరలించడం జరుగుతుందని ఆయన తెలిపారు . అలాగే 18 గంజా సేవించినట్లుగా అనుమానితులను అదుపులోకి తీసుకొని వీరందరికీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందనిఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా కమ్యూనిటి కాంటాక్టు లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే  నకిరేకల్ పట్టణంలో కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు.

కాలనీల్లో,ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్తగా ఇండ్లకు కిరాయిలకు వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ఆద్దెలకు ఇవ్వాలని ఆయన సూచించారు. నేరరహిత పట్టణంగా తీర్చి దిద్దడంతోపాటు ప్రజలకు శాంతిభద్రతలు కల్పించాలని గంజాయి తదితర మాదకద్రవాలను నిలువరించడం కోసం కృషీ చేస్తున్నామనిఆయన తెలిపారు. జిల్లాలో గంజాయిని ఆరికట్టడం కోసం మూడు దశల్లో కార్యాక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడైన గంజాయి సేవిస్తున్నట్లు,విక్రయించినట్లు, కానీ రవాణా చేస్తున్నట్లు కానీ తెలిస్తే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు. తప్పుడు డాక్యుమెంట్లతో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, నేర నియంత్రణకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి,సీఐలు రాఘవరావు, ఆదిరెడ్డి, కొండల్ రెడ్డి, కరుణాకర్, మహాలక్ష్మయ్య, ఎస్ఐలు  లచ్చిరెడ్డి కృష్ణమాచారి  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..