05-08-2025 11:35:09 AM
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల మండలం(Gundala Mandal) శంబునిగూడెం పంచాయతీలోని వెన్నలబైలు గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. పొలం వద్దకు బైకుపై వెళ్తుండగా బైక్ హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగి బైకుతో సహా పార్సిక రాజు (35) సజీవదహనం అయినట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ పేర్కొన్నారు. మృతుడిని అతని భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.