ఒక్క జిల్లా .. ఎంపీ స్థానాలు రెండు!
జయశంకర్ భూపాలపల్లి విశిష్ఠత
జయశంకర్ భూపాలపల్లి, మే 8 (విజయక్రాంతి): కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల నుంచి కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ జిల్లాకు రెండు అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే తెలంగాణలో జిల్లాలు ఏర్పడినప్పుడు ములుగు జిల్లా కూడా భూపాలపల్లిలోనే ఉండేది. ఆ తరువాత ములుగు జిల్లాను భూపాలపల్లి నుంచి విడగొట్టి ప్రత్యేక జిల్లా గా ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ నుంచి పెద్ద పల్లి పార్లమెంట్, మంథని అసెంబ్లీ స్థానా లు, వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి వరంగ ల్ పార్లమెంట్, భూపాలపల్లి అసెంబ్లీ స్థానా లు ఉన్నాయి. మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహాముత్తారం, కాటారం, మల్హర్, మహాదేవ్‌పూర్, పలిమెల, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భూపా లపల్లి, రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, గోరికొత్తపల్లి మండలాలు ఉన్నాయి.
అధికారులకు తప్పని తిప్పలు
మంథని నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో ఉన్న అధికారులకు మాత్రం ఎన్నికల సమయంలో తిప్పలు తప్పడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మంథని ఆర్డీవో కార్యాలయానికి ఇటు భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయానికి ఆయా మీటింగ్‌లకు రెండు వైపులా వెళ్లాల్సి వస్తోంది. దీంతో అధికారులు చిరాకు చెందుతున్నారు. జయశం కర్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నా ఎన్నికల రిపోర్టులు మాత్రం రెండు జిల్లాల అధికారులకు సమర్పించాల్సిందేనని అధికారులు అంటున్నారు.




