12 April, 2026 | 2:24 PM

విద్యుత్ ఆర్టిజన్ సమ్మెకు బీజేపీ సంఘీభావం

12-04-2026 01:16 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయ ఆవరణలో విద్యుత్ ఆర్టీజన్స్ సమ్మెకు ఆది వారం బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల శ్రమ దోపిడీ చేస్తుందన్నారు. విద్యుత్ ఆర్టిజన్, అన్ మ్యాండ్, పీస్ రేట్ కార్మికుల సమస్యలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం విద్యుత్ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. విద్యుత్ ఆర్టిజన్లు, బిల్ కలెక్టర్లు అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారని వారికి స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేసి APSEB రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైన విద్యుత్ ఆర్టిజన్ల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.