12 April, 2026 | 2:17 PM

బీఆర్‌ఎస్ అంటే భవిష్యత్ రహిత సమితి

09-05-2024 12:54 AM

ఖమ్మం కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సౌజన్య

ఖమ్మం, మే౮(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ రద్దైన వెయ్యి నోటు లాంటిది.. దానికి గతమే తప్ప భవిష్యత్ లేదు. బీఆర్‌ఎస్ నాయకత్వానికి అధికారం లేకుంటే అసలు ఆ పార్టీ బతకలేని పరిస్థితికి చేరుకున్నట్టు కనబడుతోంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజ లకు ఇచ్చిన హామీలను  ఒక వైపు దశలవారీగా అమలు చేస్తున్న సమయంలోనే 100 రోజుల్లోనే  అన్నీ జరగలేదని బీఆర్‌ఎస్ నానాయాగీ చేస్తున్నది. పదేళ్లు మీరేం చేశారో చెప్పండి. కాంగ్రెస్ మాట అంటే మాటే. ఇది కాంగ్రెస్ సత్తా.

బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల్లాగా దళితుడిని సీఎం చేస్తా,  నల్ల ధనం తెచ్చి 15 లక్షలు పంచుతా, ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా, పెట్రోల్ వంట గ్యాస్ రేట్లు తగిస్తా  అని బట్టేబాజ్ మాటలు  కాంగ్రెస్ చెప్పదు. బీఆర్‌ఎస్ అవినీతి గురించి మాట్లాడితే, ఏండ్లనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి గురించి చెప్తున్నరు. గతం గతహా.   గతంలాగే ఉండాలనుకుంటున్నారా? ఆ రోజులు వేరు. నాటి రాజకీయాలు వేరు.  వర్తమానంలోకి రండి వచ్చి చూడండి రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పాలనపై మాట్లాడండి.