8 March, 2026 | 3:24 PM

Breaking News

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •  

‘ఒకే భూమి - ఒకే ఆరోగ్యం’

22-06-2025 12:00 AM

శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో యోగా డే

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం ఒకే భూమి-ఒకే ఆరోగ్యం అనే జాతీయ నినాదంతో మూడు ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. అంఫి థియేటర్, బొటానికల్ గార్డెన్, ప్రేమ భవన్, భువన విజయం గ్రౌండ్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు గౌరవనీయ అతిథులు, ప్రజా ప్రతినిధులు హాజరై ప్రారంభించారు.

హాస్పిటల్ సిబ్బంది, ఆరోగ్య ప్రియులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసనాలు వేసి, అనంతరం అల్పాహారం సేవించారు. కేపీహెచ్‌బీ భువన విజయం గ్రౌండ్స్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బాబాజీ నగర్ కార్పొరేటర్ పగుడల శిరీషబాబురావు హాజరై యోగాను ప్రతిరోజూ ఆచరించాలంటూ ప్రజలకు సూచించారు.

బొటానికల్ గార్డెన్ అంఫి థియేటర్ వద్ద ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బొటానికల్ గార్డెన్ వాక ర్స్ అసోసియేషన్‌తో కలిసి నిర్వహించారు. డాక్టర్ జి చంద్రశేఖర్‌రెడ్డి, ఐఎఫ్‌ఎస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, తెలంగాణ, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, టీజీ ఎఫ్డీసీ చైర్మన్ పొదెం వీరయ్య, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి, అదనపు ప్రధాన అటవీ సంరక్షకులు సునీత ఎం. భగవత్, వైస్ చైర్మన్ ఎండీ, టీజీఎఫ్డీసీ, ఎల్. రంజీత్ నాయక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎకో టూరిజం, టీజీఎఫ్డీసీ డా. వి.ఎస్.రామచంద్ర  చీఫ్ ఆఫ్ కార్డియాలజీ, ఎలెక్ట్రోఫిజియాలజీ, చైర్మన్, హోలిస్టిక్ హాస్పిటల్స్ డాక్ట ర్ తుషార అలూరి చీఫ్ ఆఫ్ ఆఫ్థల్మాలజీ, ఎండీ, శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఏ.వి. రెడ్డి  ఫౌండర్, ప్రెసిడెంట్, బొటానికల్ వాకర్స్ అసోసియేషన్ భరత్‌రెడ్డి ప్రెసిడెంట్, బీజీ వాకర్స్ అసో సియేషన్ హాజరయ్యారు. ప్రేమ భవన్‌లో డాక్టర్ విఎస్. రామచంద్ర పాల్గొన్నారు.