తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
జనగామ, జూన్ 23: జనగామ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు కట్ల సదానందం ఆధ్వర్యంలో అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. తెలంగాణలో మెజారిటీగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజకీయంగా న్యాయం జరగాలనేదే తమ పార్టీ ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో సీసా శ్రీధర్‌గౌడ్, గుజ్జుక రాజు, రంపే కుమారు, బాబా, దండు రాణి, దండు సౌమ్య, కొలిపాక మమత, ఆఫ్రిన్, వెంకటయ్య యాదవ్, రామానుజన్, జిల్లా ఉపాధ్యక్షులు రేణిగుంట మురళి బైండ్ల, యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్, యూత్ ప్రధాన కార్యదర్శి చెన్నూరు వంశీ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పానుగంటి నర్సింగరావు, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు గంగరాజు పాల్గొన్నారు.






