ఆర్టీసీని ఆదుకొని దార్శనికత చాటాలి
సర్వజన సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తామని, సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తామని 2023 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చి తమ సర్కార్ కార్మిక పక్షపాతి అని కాంగ్రెస్ నిరూపించుకున్నది.
ఆర్టీసీ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడటంతో కాంగ్రెస్ సర్కార్ వెంటనే స్పం దించింది. ఆర్టీసీ జేఏసీతో చర్చించి, కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చి సమ్మె విరమింపజేసింది. అయితే, తొలుత ఆర్టీసీ కార్మికులు 32 డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వగా, ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీ వేసింది. ఆ కమిటీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు దిగనున్నట్లు జేఏసీ ప్రకటించింది. కార్మికులు రోడ్డుపైకి రావడం తో ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది.
రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేలకు పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యా యి. మూడు రోజులపాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులతో జేఏసీ జరిపిన చర్చలు విఫలం కావడంతో మనస్తాపానికి గురై, నాడు కేసీఆర్ సర్కార్‌లాగే కాలయాపనతో కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందేమోనని, తన బలిదానంతోనైనా కార్మికుల హక్కులు నెరవేరుతాయని భావించి నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ చేసుకున్న బలిదానం యావత్ తెలంగాణ సమాజాన్ని కలవరపెట్టింది.
అదే సమయంలో గడ్డి మందు తాగి ఒకరు, పెట్రోల్ పోసుకొని మరొకరు ఆత్మహత్యాయత్నం చేయడంతో రేవంత్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించిం ది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభా కర్, మంత్రులు దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో ఒక కమిటీ వేయడం, ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించడం ప్రజాపాలనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
జేఏసీ డిమాండ్లను పరిశీలించిన భట్టి కమిటీ బాధ్యతతో వ్యవహరించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయమై హామీ ఇవ్వడమే కాకుండా, 30 శాతం వేత న సవరణ, యూనియన్ల పునరుద్దరణ, ఇంకా అనేక సమస్యలపై కూలంకషంగా చర్చించింది. అంతేకాదు, 11 శాతం వేతన సవరణతో ఆమోదం తెలిపింది. ఈ సమ్మె లో టీజీఎస్‌ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జేఏసీకి అండగా నిలిచింది. ఉద్యమంలోనూ చురుకైన పాత్ర పోషించింది. అధిపత్య పోరుతో 17వ తేదీ వరకు రెండు జేఏసీలు ఒకటే ఎజెండాలతో ఉండిపోయి నా, ఆర్టీసీ యాజమాన్యం గాని, ప్రభుత్వం గాని చర్చల ఊసెత్తలేదు. ఈ నేపథ్యంలో యజమాన్యం, ప్రభుత్వం నుంచి ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల పరిష్కారం విషయమై సానుకూలమైన సంకేతాలు రాక పోవడంతో బీసీ బిడ్డ కోలా శంకర్ గౌడ్ మనస్థాపానికి గురయ్యారు.
తన బలిదానంతోనైనా తోటి కార్మికుల హక్కులు నెర వేరుతాయనే సంకల్పంతో ఆయన పెట్రో ల్ పోసుకొని అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ ఘటనతో కార్మికలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. నాడు తెలంగాణ ఉద్యమం లో శ్రీకాంతచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, ఒక యాదయ్య త్యాగాలతో తెలంగాణ ఏర్పడ్డది. అలాగే నేడు బీసీ బిడ్డ త్యాగంతో కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యా యి. ఏ ఉద్యమంలోనైనా బీసీ బిడ్డలు చేస్తున్న త్యాగాలు చిరస్మరణీయమని చెప్పాలి. నాడు స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో, నేడు ఆర్టీసీ విలీనం, కార్మికుల హక్కులు సాధించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు.
ఏమాత్రం నిర్ణ యం తీసుకోవడం ఆలస్యమైనానేడు ఎందరో ఈ ఉద్యమంలో బలైపోయే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలోనే కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోని కుటుంబాలను రోడ్డు మీద వేయొద్దని, ప్రజా ప్రభుత్వం సమస్యను పరిష్కరిస్తుందని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 24 గంట ల్లోనే 32 డిమాండ్లలో 31 డిమాండ్లకు అంగీకారం తెలిపారు. దీంతో కార్మికులు రైట్.. రైట్ అంటూ బస్సులను తిప్పారు. ఇది అమరుడు శంకర్ గౌడ్ సాధించిన విజయమని చెప్పక తప్పదు.
నాడు బీఆర్‌ఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగినప్పుడు ఇలా జరగలేదు. అయినా తెలంగాణ రాష్ట్ర సాధన లో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మిక వర్గానికి, నాటి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సమ్మె పీటముడి పడుతుందని ఎవరూ ఊహించలేదు. సమాజంపై అదొక అశనిపాతంలా మారింది. ఇరువర్గాలు మొండి పట్టుదలకు పోవడంతో సమస్య రోజురోజుకూ మరింత జఠిలమైంది. వివిధ సంద ర్భాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, నర్మగర్భంగానో ఈ సమస్య సామరస్య పూర్వ కంగా పరిష్కారం కావాలని హైకోర్టు కూడా ప్రయత్నించింది.
కానీ, అలా జరగలేదు. నాటి ప్రభుత్వం మొండిగా వ్యవహ రించడంతో ఆర్టీసీ సమ్మె తప్పలేదు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది. అదే అదనుగా ప్రైవేటు రవాణా వ్యవస్థలు ప్రయాణికులను నిలువు దోపిడీ చేశాయి. సమ్మె కారణంగా కార్మికులే కాదు, ప్రజలు కూడా దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోలేకపోయారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ అన్న మాదిరిగా నాటి కేసీఆర్ ప్రభుత్వం పట్టుదలకు పోవడంతో సమ్మె 54 రోజులపాటు సాగింది. నాడు ఒక్క మంత్రి కూడా కేసీఆర్‌కు ఎదురుచెప్పే పరిస్థితి లేదు. సమ్మెకు పరిష్కారం దొరకక అంతిమంగా ప్రజలు నష్టపోయారు.
సుహృద్భావం, పరస్పర అవగాహనతో చర్చిస్తే అంతర్జాతీయ సమస్యలే పరి ష్కారం అవుతున్న ఈ కాలంలో ఆర్టీసీ సమస్య ఎంత? నాడు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వానికి చేతులు రాలేదు. పైగా ప్రభుత్వం చర్చలకు పిలవకుండా డెడ్‌లైన్లు విధించడం, బస్సు రూట్లను ప్రైవేటుకు అప్పగిస్తామంటూ ప్రకటనలు గుప్పించడం దారుణం. ఈ కారణంగానే దాదాపు 30 మందికి పైగా కార్మికులు అసువులుబాశారు. కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించడమూ కేసీఆర్ ఓటమికి ఒక ప్రధాన కారణమని చెప్పక తప్పదు.
తెలంగాణ రవాణా వ్యవస్థకు ప్రత్యేక చరిత్ర ఉంది. ఇది దోపిడీకి, రాపిడికి గురై న ప్రాంతం. నిజాం దొరల పాలనలో నలిగిపోయిన ప్రాంతం. ముఖ్యంగా నైజాం రాచరిక వ్యవస్థలో ఎన్నో నిరంకుశ చట్టాలు అమలుపరిచినా రవాణా వ్యవస్థ మాత్రం సర్కారు ఆధీనంలోనే ఉండేది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజలు ఉపాధి నిమిత్తమో, ఇతర అవసరాల కోస మో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి నైజాం ఆర్టీసీ ఉపకరించేది.
ముఖ్యంగా రోడ్డు రవాణా, రైల్వే రవాణా వ్యవస్థలు రెండూ నిజాం ప్రభుత్వం ఆధీనంలోనే ఉండేవి. కానీ, గత పాలకుల పాలనలో ఆర్టీసీ నిర్వీర్యమైపోయింది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మిపథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఆర్టీసీ బలోపేతానికి కృషి చేసింది. ఉచిత బస్సు ద్వారా రోజుకు 35 లక్షల మంది ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పించింది.
ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ ప్రభు త్వం హామీ ఇచ్చిన విలీన సమస్య, 2021 వేతన సవరణ పెండింగ్‌లో పడ్డాయి. ఇవేమీ పట్టని బీఆర్‌ఎస్, బీజేపీలు కార్మికుల సమస్యలు విస్మరించి పోటీపడి మరీ ప్రశ్నించాయి. ఇదే అదనుగా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిం చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బీజేపీ కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చెప్తూ తమ బాధ్యతలను వారు మరిచారు.
అసలు దేశంలో కార్మికుల గొంతుకోసే నల్ల చట్టాలు తెచ్చింది ఎవరూ? శవాల మీద పేలాలు ఏరినట్టు సమస్య పరిష్కారానికి దారిచూపకుండా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను రాజకీయంగా వాడుకోవాలని కుయుక్తులు పన్నింది ఎవరు? అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని నిరూపించుకున్నది. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి, బలిదానం చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోని దార్శనికతను చాటాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది.
వ్యాసకర్త: 9866255355
ప్రొ.సంగని మల్లేశ్వర్






