15 June, 2026 | 1:24 AM

సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలి

15-06-2026 12:00 AM

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

దేవరకద్ర జూన్ 14 : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు ఈ విషయంపై పూర్తిస్థాయిలో సమగ్ర అవగాహన కలిగి ఉండాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకద్రలోని నిర్వహించిన ఓటర్ సవరణ ప్రత్యేక కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. 

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బూత్ లెవెల్ ఏజెంట్లు  లు బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎవరు తేలికగా తీసుకోవద్దని, ఇప్పటి వరకు ఓట్లు వేసాం కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రేపు మన ఓటే జాబితాలో లేకుండా చేసే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు.  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు, మార్కెట్ యార్డ్ ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.