21-05-2025 12:00:00 AM
ఎస్పీ జానకీ షర్మిల
నిర్మల్ మే 20( విజయక్రాంతి): న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌లో మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల పోలీసు అధికారులను సూచించారు మంగళవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయం నుంచి ఆయా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలతో లోక్ అదాలత్ కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు. ఏఎస్పీ ఉపేందర్ రెడ్డితో కలిసి ఎస్పీ మాట్లాడారు జూన్ 14న నిర్వహించే లోక్ అదాలత్ గురించి మాట్లా డారు.
గ్రామ స్థాయిలో కమ్యూనిటీ మద్య ర్తిత్వం అనే కొత్త కార్యక్రమంపై చర్చ జరిగిం ది. సమావేశంలో, మధ్యస్థులుగా ఎంపిక య్యే వారు సమాజానికి సేవ చేసిన, మంచి పేరు గల, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న వ్యక్తులు కావాలనేది ముఖ్య ఉద్దేశ్యం.
వీరిలో రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సామా జిక కార్యకర్తలు, గ్రామ పెద్దలు వంటి వారు ఉండవచ్చు. ప్రజలను న్యాయ పరిష్కార ప్ర క్రియలో భాగం చేయడం ద్వారా, గ్రామాల్లో శాంతియుత, సమగ్ర వాతావరణం ఏర్పడు తుంది.
జూన్ 14న జరుగబోవు జాతీయ లోక్ అదాలత్ దృష్టిలో ఉంచుకుని , ఇప్పటి వరకు లోక్ అదాలత్‌లో పరిష్కరించిన కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, అవినాష్ కుమార్, రాజేష్ మీన, ఇన్స్పెక్టర్ లు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు