16 April, 2026 | 1:42 AM

నిబంధనలు పాటిస్తూ గమ్యం చేరుకోవాలి

16-04-2026 12:21 AM

సికింద్రాబాద్, ఏప్రిల్15, (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నిబంధనలను పాటించాలని, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు విద్యార్థులలో అవగాహన కల్పిస్తామని కార్ఖానా ఇన్స్పెక్టర్ బి అనురాధ తెలియజేశారు. రాష్ట్ర పోలీసు శాఖ ఆదేశాల మేరకు ఏప్రిల్ 13 నుండి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాలు పీఎం  కేవీ పికెట్ విద్యాలయంలో విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా నిర్వహించారు.

విద్యార్థులు, ప్రజల్లో రహదారి భద్రత నిబంధనలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్టు కార్ఖానా ఇన్స్పెక్టర్ బి.అనురాధ, సబ్ ఇన్స్పెక్టర్లు  పాల్గొని విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ పోలీసుల భయం కోసం కాదు, మీ కుటుంబం, పిల్లల భవిష్యత్తు కోసం నిబంధనలు పాటించి క్షేమంగా ఇంటికి చేరుకోవడమే ఈ కార్యక్రమ అసలు ఉద్దేశ్యం‘ అని ఇన్స్పెక్టర్ అనురాధ పేర్కొన్నారు.

ప్రజా ప్రతిజ్ఞ వాహనదారులు, బాటసారులు విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఏసిపిజి. రమేష్, ఇన్స్పెక్టర్ బి.అనురాధ, పీఎం శ్రీ కె.వి  విద్యాలయ ప్రిన్సిపల్ రూపేందర్ సింగ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.