సర్‌పై అప్రమత్తంగా ఉండాలి
మీనాక్షినటరాజన్, మహేష్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(సర్)పై అప్రమత్తం గా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. సర్‌పై గురువారం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జూమ్ సమీక్ష జరిగింది.
బూత్ స్థాయి ఏర్పాట్లు, బీఎల్‌ఏల పనితీరుపై పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా వివరాలు తెలుసుకున్నారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలోని పనితీరును సమీక్షించారు. పనితీరు మెరుగుపర్చాల్సిన ప్రాంతాలపై దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయిలో సమన్వయం మరింత బలోపేతం చేయాలని, ప్రతి బీఎల్‌ఏ పూర్తి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలు, పార్లమెంట్ ఇంచార్జ్‌లు, పార్లమెంట్, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.






