వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి
08-08-2026 01:56 PM
నర్సాపూర్ ఆగస్టు 08: వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు, రైతులు, వాహన దారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ రంజిత్ కుమార్ సూచించారు. భారీ వర్షాల సమయంలో వాగులు, కాలువలు, చెరువులు, లోతట్టు ప్రాంతాలు, నీటితో నిండిన కల్వర్టుల వద్దకు వెళ్లవద్దని కోరారు. రైతులు విద్యుత్ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, తెగిపడిన విద్యుత్ తీగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వర్షపు నీటితో నిండిన వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకూడదన్నారు. వాహనదారులు వేగాన్ని తగ్గించి ప్రయాణించాలని సూచించారు. పిల్లలను నీటి ప్రాంతాల వద్దకు ఒంటరిగా వెళ్లనివ్వకూడదని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు సమాచారం అందించాలని ఎస్‌ఐ రంజిత్ కుమార్ కోరారు.






