8 August, 2026 | 4:02 PM

విద్యార్థులను నడిపించేది ఉపాధ్యాయులే

08-08-2026 02:46 PM

ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం 

 ఎస్ టి యు ఉపాధ్యాయ సంఘం సమావేశంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): విద్యార్థుల దిశ దశ మార్చే శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందని నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం న్యూటౌన్‌లోని దక్ష హైస్కూల్ లో ఎస్ట్ యూ టీ ఎస్ 80 వసంతాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుల హక్కుల సాధనలోనూ, విద్యారంగ పరిరక్షణలోనూ ఎస్టీయూ సంఘం గత 80 ఏళ్లుగా చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.  విద్యార్థులను క్రమశిక్షణలో నడిపించి ఉన్నత లక్షలను చేసేందుకు దారి చూపే వారిలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంటుందన్నారు. ప్రతి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందని, ఉపాధ్యాయుల కలలను విద్యార్థులచేత నెరవేర్చల ఎంతో శ్రమించి అవగతం చేస్తారని  పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్టీ యూ రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శి జాటు గణేషం, జిల్లా అధ్యక్షులు నర్సింహులు గౌడ్,​ క్రాంతి కిషోర్, నవాబ్‌పేట అధ్యక్షులు, బి. నాగేంద్ర కుమార్,సహయేత ప్రధాన కార్యదర్శి, గోపాల్ నాయక్-కోయల్‌కొండ అధ్యక్షులు, బి. ఆంజనేయులు గారు - జిల్లా సహ అధ్యక్షులు,  జిల్లా స్థాయి ఉపాధ్యాయ నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.