23 March, 2026 | 2:57 PM

Breaking News

పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •   జగన్నాద్ పూర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు   •   మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సీఎం శుభవార్త   •   అణచివేత ధోరణి వీడి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి   •   ఓబీసీ చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే బాధ్యతలు.. పాల్గొన్న మంత్రి పొన్నం   •   పశ్చిమాసియాలో యుద్ధం.. లోక్‌సభలో మోదీ ఆందోళన   •   అసెంబ్లీ ముట్టడి అడ్డుకట్ట – బీజేపీ నాయకుల అరెస్టుపై ఆగ్రహం   •  

వేసవి తాపంపై కనబర్చాలి

23-03-2026 12:00 AM

ఘట్ కేసర్, మార్చి 22 (విజయక్రాంతి): వేసవిలో తాగునీటి ఎద్దడి ఎక్కువే. దీనికి తోడు దాహాతీర్చు కోవాలనే తొందరలో ఎక్క డ పడితే అక్కడ లభించే నీటిని తాగే ప్రయత్నం మానుకోవాలి. కలుషిత తాగునీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం చెడిపోవ డం ఖా యం. ముఖ్యంగా సురక్షితం కాని ప్యాకెట్ నీరు తాగడం వల్ల కొత్త జబ్బులు వచ్చే ఆస్కారం ఉందని వైద్యులు హెచ్చ రి స్తున్నారు. ఎక్కువ చల్లగ ఉండే నీటిని తీసుకోవడం వల్ల గొంతు సంబంధిత వ్యాదులు ఉత్పన్నం అవుతున్నాయని కావున పిల్లలు, పెద్దలు, వృద్దులు తగిన జాగ్రత్తలు పాటిస్తే వేసవి తాపం బారిన పడకుండా ఉపశమనం పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

వీటితో కొంత ఉపశమనం..

వేసవి తాపం నుంచి తొందరగా ఉపశమనం పొందేందుకు నిమ్మరసం, కొబ్బరిబోండం లాంటివి సేవించడం చాలా అవసర పడుతుంది. వీటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చౌకగా లభించే పండ్ల రసాలలో యాపిల్, నారింజ, బత్తాయి తీసుకోవడం శ్రేష్ఠం. పండ్లలో నీటిశాతం ఎక్కువగా ఉండే వాటిని ఎంచుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది.

దీన్ని తీసుకోవడం వల్ల వేసవి తాపానికి కోల్పోయిన శక్తి, నీరు బర్తీ అవుతాయి. వేసవి తాపాన్ని ఉపశమనింప చేయడంలో కర్బుజాకు సాటి మరొకటి లేదు. దీనిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. ఇది సత్వర శక్తిని ఇస్తుంది. ఎండలో తిరిగి వచ్చిన వారు తక్షణ ఉపశమనానికి ఖర్భూజాను తింటే దప్పిక, అలసట తగ్గి శక్తి వస్తుంది.