కేసీ పుల్లయ్య ఫౌండేషన్ స్థాపించడం అభినందనీయం
కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ
ముషీరాబాద్,మార్చి 22(విజయక్రాంతి): మనకు ఉన్న సంపాదనలో కొంత భాగమైనా సమాజ సేవకు ఖర్చు చేయాలన్న సంకల్పంతో కేసీపుల్లయ్య ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిండం అభినందనీయమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. అతి తక్కువ కాలంలోనే ఈ ఫౌండేషన్ సేవలను అన్ని ప్రాంతాలకు విస్తరిం చడం శుభపరిణామమని అన్నారు.
కేసీ పుల్లయ్య స్థాపించిన ఫౌండేషన్ ను ఆయన కుటుంబసభ్యులు అనేక సంవత్సరాలుగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుపేద ప్రజలను ఆదుకుంటున్నారని, ఈ ఫౌండేషనన్ ను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆదివారం దో మలగూడ గగన్ మహల్‌లో కేసీ వుల్లయ్య పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధాన కార్యాలయాన్ని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ, బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే గణేష్, కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ట్రస్టీలు అనిల్ కుమార్ కామిశెట్టి, సుశీల్ కుమార్ శెట్టిలు హాజరై ప్రారంభించారు.
ఈ సందర్బంగా వివిధ రంగాలల్లో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రకటించి వారికి శాలువాలు కప్పి మొమొంటోలు నగదు పురస్కా రం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ కేసీ పుల్లయ్య స్థాపించిన ఫౌండేషన్ సేవలను నిరంతరం కొనసాగిస్తూ తండ్రి ఆశయాలను నెరవేరుస్తున్న ఆయన కుమారులు, కుటుంబ సభ్యు లను కేంద్రమంత్రి అభినందించారు.
ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీ పులయ్య ఫౌండేషన్ సామాజిక సేవకు అంకితమై విద్యా, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్రపోషిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేసీ పుల్లయ్య ఫౌండర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ కామిశెట్టి, ఫౌండర్ ట్రస్టీ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ కామిశెట్టి, ట్రస్టీ సభ్యులు సుశీల్ కుమార్ కామిశెట్టి, కార్యనిర్వాహక సభ్యులు వాసుదేవరావు పరిమ్, సిఈఓ అండ్ ట్రస్ట్ సుధా చల్ల, గౌరవ చైర్పర్సన్ కె. కృష్ణ వేణమ్మ, ఫౌండేషన్ సభ్యులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




