రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
03-08-2026 01:52 AM
మేడ్చల్, ఆగస్టు 2 (విజయ క్రాంతి): కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి ఎక్స్ రోడ్ మహేంద్ర షోరూం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. చీర్యాల ఇందిరమ్మ కాలనీకి చెందిన మంద నరసింహులు (35) విధులకు హాజరు కావడానికి తన బైక్ పై బండ్లగూడ నుంచి రాంపల్లి చౌరస్తా వైపు వెళ్తుండగా లారీ డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ అకస్మాత్తుగా కుడివైపు మళ్లించి నరసింహులను ఢీకొట్టాడు. దీంతో నరసింహులు డివైడర్ పై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






