calender_icon.png 14 June, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంకెన్ డ్రైవ్‌లో ఒకరికి జైలు శిక్ష

11-06-2025 12:05:15 AM

అర్మూర్, జూన్ 10 (విజయ క్రాంతి): మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి జడ్జి జైలు శిక్ష విధించినట్లు అర్మూర్ ఎస్.హెచ్.ఓ. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా ఎర్రన్న అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడినట్లు తెలిపారు.

సదరు వ్యక్తిని కోర్టులో హాజరు పరచగా ఆర్మూర్ సెకండ్ క్లాస్ న్యాయమూర్తి గట్టు గంగాధర్ ఎర్రన్నకు మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు వివరించారు.