29 June, 2026 | 7:35 PM

ప్రభుత్వాస్పత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్

11-06-2025 12:07 AM

నల్లగొండ టౌన్, జూన్10: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం  పట్టపగలే మూడు సంవత్సరాల బాలుడు కిడ్నాప్ కలకలం రేపింది. ఆసుపత్రిలో ఆడుకుంటున్న ఆ బాలుడిని ఒక వృద్ధురాలు  ఆటోలో  ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ విషయం తెలుసుకున్న డిఎస్పీ కే శివరాంరెడ్డి రంగంలోకి దిగి తమ ప్రత్యేక బృందాలతో గాలిపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో  రైల్వే స్టేషన్, బస్టాండ్, హోటల్స్, లాడ్జింగ్ ముఖ్య కూడలల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.