28 April, 2026 | 7:29 PM

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

28-04-2026 05:47 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని కుప్రియల్ గ్రామ స్టేజి వద్ద 44జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో కుప్రియల్ గ్రామానికి చెందిన ఏలేటి రాజులు తివ్రంగా గాయపడ్డారు. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామం నుండి  కుప్రియల్ చౌరస్తా వద్ద తమ గ్రామం వైపు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా, నిజామాబాద్ వైపు నుండి వస్తున్న గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో కిందపడిపోయి గాయాలపాలైనట్టు పోలీసులు తెలిపారు. వెంటనే బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు ఎస్ ఐ పుష్పరాజ్ తెలిపారు.