17 August, 2026 | 1:07 AM

స్వయం ఉపాధితో పదిమందికి మార్గదర్శకంగా నిలవాలి

17-08-2026 12:00 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

బడంగ్ పేట్, అగస్టు 16(విజయక్రాంతి): మన్సాన్పల్లి రోడ్డులో ’ఆర్యన్ డిజిటల్స్’ ఫ్లెక్స్ షాప్ను ప్రారంభించిన మాజీ మంత్రి బడంగ్పేట్ (ఆగస్టు 16):ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి రంగంలో రాణిస్తూ, మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు.

మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలోని మన్సాన్పల్లి రోడ్డులో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ స్వర్ణగంటి ఆనందం నూతనంగా ఏర్పాటు చేసిన ’ఆర్యన్ డిజిటల్స్’ ఫ్లెక్స్ షాప్ను ఆదివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులకు ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పి.ఏ.సి.ఎస్ చైర్మన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, మాజీ ఎంపిటిసిలతో పాటు బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.