17 August, 2026 | 4:38 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు డాక్టరేట్ ప్రధానం

17-08-2026 12:00 AM

గత 40ఏళ్లుగా చేస్తున్న సామాజిక సేవకు గుర్తింపుగా అవార్డు

ముషీరాబాద్,ఆగస్టు16 (విజయక్రాంతి) గత 40ళ్లుగా ప్రజలకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు క్రిస్ హోలీ స్పిరిట్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ను ప్రధానం చేశారు. యూనివర్శిటీ ఆధ్వర్యంలో వరల్ ఐకానిక్ అవారడ్స్ 2026 ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా ముఠా గోపాల కు యూనివర్శిటీ చైర్మన్ బిషప్లు డాక్టర్ ఆనంద్, భాస్కర్ రెడ్డి, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ గోనఫిలిప్, జాన్విక్టర్, డాక్టర్ అబ్రాహంలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆదివారం యూనివర్శిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. గత 40 ఏళ్లుగా ప్రజా సేవలో పనిచేస్తున్న ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ చైర్మన్గా, కనీస వేతనాల బోర్డు చైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వహించి ప్రజలకు ఎనలేని సేవలు అందించారు.

11సంవత్సరాలు తెలుగు దేశం పార్టీ నగర కన్వీనర్, నగర అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో కృ షిచేశారు. ఆర్టీసి కండక్టర్గా జీవితాన్ని ప్రారంభించిన ముఠా గోపాల్ అంచలంచలుగా ఎదుగుతూ రెండు సార్లు ముషీరాబాద్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధిం చారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమ్యల పరిష్కారానికి కృషిచేస్తున్న ముఠా గోపాల్ డాక్టరేట్ ప్రధానం పట్ల ముషీరాబాద్ ప్రజలు, వివిద పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.