25 May, 2026 | 1:06 AM

క్రీడల్లో నైపుణ్యత పెంపొందించుకోవాలి

25-05-2026 12:00 AM

సర్పంచ్ దున్నా శ్రీనివాస్

కోదాడ (నడిగూడెం)మే 24: వేసవి శిక్షణను క్రీడాకారులు ఉపయోగించుకొని క్రీడల్లో నైపుణ్యతను పెంపొందించుకోవాలని సర్పంచ్ దున్నా శ్రీనివాస్ కోరారు. నడిగూడెం మండల కేంద్రంలోని శ్రీ కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 42 రోజులపాటు వేసవి క్రీడా శిక్షణలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు నడిగూడెం గ్రామానికి చెందిన ఒకటో వార్డు సభ్యులు దున్నా శ్రీకాంత్ తన తండ్రి కీర్తిశేషులు దున్నా లింగయ్య జ్ఞాపకార్థం 50 మంది క్రీడాకారులకు క్రీడలకు చెందిన టీ షర్టులను సర్పంచ్ దున్నా శ్రీనివాస్ చేతుల మీదుగా ఆదివారం పంపిణీ చేశారు.

క్రీడా శిక్షణ ఇస్తున్న పిడి నాగేశ్వరరావును, క్రీడా దుస్తుల దాత దున్నా శ్రీకాంత్ ను శాలువాలతో క్రీడాకారులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కబడ్డీ క్రీడ అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శి సిహెచ్ కరుణాకర్,ఉపాధ్యాయులు మేరాజుద్దీన్,ఇంతియాజ్, వ్యాయామ ఉపాధ్యాయులు చింతల రమేష్,క్రీడాకారులు మళ్లీ, సమద్,అజయ్ ఆకాష్ షకీల్,దున్నా సురేష్ పాల్గొన్నారు..