calender_icon.png 2 November, 2025 | 11:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతో పాటు క్రీడారంగంలో రాణించాలి

01-11-2025 08:25:53 PM

వాసవి విద్యాసంస్థల చైర్మన్ మాదారం రమేష్

ఇబ్రహీంపట్నం: విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో రాణించాలనీ వాసవి విద్యాసంస్థల చైర్మన్ మాదారం రమేష్ అన్నారు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం 69వ రంగారెడ్డి జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ అండర్ 17 విభాగంలో జరిగిన పోటీల్లో ఇబ్రహీంపట్నంకు చెందిన వాసవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జె.రితిక అండర్ 17 వెయిట్ లిఫ్టింగ్ 48 కేజీల కేటగిరీలో బాలికల విభాగంలో వెండి పతకం సాధించినది.

ఈ సందర్బంగా వాసవి విద్యాసంస్థల చైర్మన్ మాదారం రమేష్ మాట్లాడుతూ.. భావిష్యత్తులో తమ కళాశాల విద్యార్థులు క్రీడారంగంలో రానిస్తూ, చదువుతో పాటు మంచి గుర్తుంపు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం వాసవి విద్య సంస్థల చెర్మన్ మదారం రమేష్, శేఖర్, క్రీడాకారులను, పీ.ఇ.టి రహమత్ లను ఘనంగా సన్మానించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం సుధాకర్, సురేష్ ప్రశాంత్, రవి తదితరులు పాల్గొన్నారు.