15 June, 2026 | 8:15 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

ప్రజలకు అవగాహన కల్పిస్తూ... హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

01-11-2025 08:27 PM

మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ నగరపాలక సంస్థ 21 డివిజన్ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఏ. శైలజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లపై అధిక చెత్త వేసే ప్రాంతాలను గుర్తించి, అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించామని ఇచ్చట చెత్త వేయరాదు వేచినచో 25 వేల రూపాయల వరకు జరిమానా విధించబడును అని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. స్వచ్ఛ వాహనంలో మాత్రమే చెత్తను వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ భూక్య సుమన్, కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.