స్వార్థం వీడి ప్రజా సేవ చేయాలి
కామారెడ్డి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మేయర్, చైర్‌పర్సన్, కౌన్సిలర్లకు ఘన సన్మానం
కామారెడ్డి, మార్చి 1 (విజయక్రాంతి): ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యాక స్వార్థం వీడి ప్రజా సేవ చేయాలనీ ప్రజలకు సేవ చేయడంలోనే సంతోషం ఉందని నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి కరాటే రమేష్ ముదిరాజ్ అన్నారు. నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి రమేష్, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, నిజామాబాద్ కార్పొరేటర్, కామారెడ్డి ఏడుగురు కౌన్సిలర్లు, బాన్సువాడ, ఎల్లారెడ్డి కౌన్సిలర్లకు ఆదివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డిలో సన్మాన సభ ఏర్పాటు చేశారు.
సన్మాన సభలో నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతూ ప్రజలకు పట్టణవాసు లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేయడంలో సంతోషం ఉందన్నారు. నిజామాబాద్ కామారెడ్డి పట్టణాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తామన్నారు. సమాజ సేవ చేసే వారికి ఓటమి ఉండదన్నారు. రూపాయి ఖర్చు లేకుండా సేవ చేయడంతో మేయర్ పీఠం ముదిరాజ్ బిడ్డగా అవకాశం వచ్చిందని నిజామాబాద్ మేయర్ ఉమారాణి కరాటే రమేష్ అన్నారు.
మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణ సమస్యల పరిష్కారానికి శ్రద్ధ వహిస్తానన్నారు. నిజామాబాద్ మేయర్ పేరు తన పేరు ఉమారాణి కావడం, ఇద్దరం నిజామాబాద్ కు కామారెడ్డికి ప్రథమ పౌరురాలు కావడం యాదృచ్ఛిక మన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ చైర్ పర్సన్ పదవులు పొందడం సంతోషమని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఉమారాణి అన్నారు.
నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్, నిజామాబాద్ కార్పొరేటర్ మటము పవన్, కామారెడ్డి ఏడుగురు కౌన్సిలర్లు పిట్ల వేణుగోపాల్, గేరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ, కాళ్ల రాజమణి గణేష్, దాకి అరవింద్, సునుగురి భాను ప్రకాశ్, బాన్సువాడ కౌన్సిలర్ లింగమేశ్వర్, ఎల్లారెడ్డి కౌన్సిలర్ దుంపల మంజుల శంకర్ లకు కామారెడ్డి పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.
మూడు ముదిరాజ్ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముదిరాజ్ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, నీలకంఠం జిల్లా అధ్యక్షులు భూపాల్ విజయానంద్, బట్టు విట్టల్, పట్టణ అధ్యక్షులు కాళ్ల గంగారాజు, ప్రధాన కార్యదర్శి దుబ్బాక ప్రసాద్, ముదిరాజ్ సంఘ నాయకులు పిల్లి మల్లేష్, చింతల రమేష్, గోలివాడ శంకర్, గోలివాడ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.




